– ఈడీ విచారణకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణుల నిరసన
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విచారణ మూడో రోజుకు చేరుకుంది. మనీలాండరింగ్ కేసులో ఈడీ రాహుల్‌పై ప్రశ్నల పరంపరను కొనసాగిస్తోంది. అయితే ఈడీ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగారు.
పోలీసులు కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకుని స్టేషన్ కు తరలించారు. రెండో రోజు 10 గంటల పాటు రాహుల్ ను విచారించింది ఈడీ. ఇదే క్రమంలో వరుసగా మూడో రోజు ఈడీ ముందుకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. గడిచిన 2 రోజుల్లో 21 గంటలపాటు ఈడీ ప్రశ్నించింది.
తొలిరోజు 10 గంటల పాటు, రెండో రోజు 11 గంటల పాటు విచారణ జరిపిన ఈడీ.. ఇప్పటికే ఈ కేసులో పలు కీలక విషయాలకు సంబంధించిన ప్రశ్నలను విచారణ సమయంలో అడిగినట్లు సమాచారం.
మూడో రోజు రాహుల్ ఏఐసీసీ కార్యాలయం నుంచి బయలుదేరగా .. ఈడీ విచారణకు నిరసనగా కాంగ్రెస్ ఎంపీలు, నేతలు, కార్యకర్తలు ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఏఐసీసీ కార్యాలయానికి వస్తున్న కాంగ్రెస్ ఎంపీల్ని పోలీసులు అడ్డుకోవడంతో వారు పార్లమెంటులో నిరసన తెలిపేందుకు వెళ్లారు. అదే సమయంలో ఈడీ ఆఫీసు ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర నిరసనలు చేపట్టారు.