దేశంలోని స్వతంత్ర వ్యవస్థలపై బీజేపీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) దాడులు చేస్తున్నాయని తాను చెప్పడం ఆపనని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పుడు ప్రధాని, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల మదిలో గందరగోళం నెలకొందన్నారు.

ప్రధాని, బీజేపీ లేదా ఆర్‌ఎస్‌ఎస్‌పై దాడి భారతదేశంపై దాడి కాదన్నారు. భారతదేశంలోని స్వతంత్ర సంస్థలపై దాడి చేయడం ద్వారా, వారు భారత్ పై దాడి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు చేయడం తాను ఆపనన్నారు.
భారత్‌లో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, ప్రతిపక్షాలు ‘అసమంజసమైన’ క్రిమినల్ కేసులతో నిరంతరం ఒత్తిడికి గురవుతున్నాయని రాహుల్ గాంధీ ఇటీవల లండన్ లో వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ మండిపడుతోంది. ఆ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.