మోడీ సర్కార్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దర్యాప్తును బీజేపీ అణిచివేత చర్యల్లో భాగంగా ఆయన పేర్కొన్నారు.
బీజేపీ పార్టీకి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడబోమన్నారు. కాషాయ పార్టీ ఏం చేసినా తాము బెదరబోమని స్పష్టం చేశారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఒత్తిడి తీసుకు వస్తే తాము భయపడి మౌనం దాలుస్తామని కాషాయ నేతలు భావిస్తున్నారని అన్నారు. కానీ తాము మౌనంగ ఉండబోమని, బీజేపీ చర్యలను ఎండగడుతూనే ఉంటామన్నారు.
కాంగ్రెస్‌కు చెందిన నేషనల్ హెరాల్డ్ భవనంలోని యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఈడీ సీల్ వేసింది. దీంతో నేషనల్ హెరాల్డ్‌పై ఈడీ దాడులను కాంగ్రెస్ తప్పు పట్టింది.