మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు.రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నామంటూ కేంద్రం మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. సూటు, బూటు సర్కార్ కారణంగా రైతుల ఆదాయం తగ్గితే.. వారి మిత్రుల ఆదాయం నాలుగు రెట్లు పెరిగిందని విమర్శించారు.
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు దేశ రాజధానిలో చేస్తున్న ఆందోళనను దృష్టిలో పెట్టుకొని రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని చెప్పారు. వారు చేసిన పనితో వారి స్నేహితుల ఆదాయం మాత్రమే నాలుగు రెట్లు పెరిగి.. రైతుల ఆదాయం సగానికి సగం అవుతుంది. ఈ సూటు-బూటు ప్రభుత్వం అబద్ధాలు, లూటీలకు చెందినది’ అంటూ ట్వీట్ చేశారు.
ఇక రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రధాని ప్రసంగం వినిపిస్తుండగా.. రైతులపై పోలీసులు వాటర్ కెనాన్లతో దాడి చేస్తున్న ఓ వీడియోను కూడా రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
कहा- किसान की आय दुगनी होगी।
किया- ‘मित्रों’ की आय हुई चौगुनी और किसान की होगी आधी।
झूठ की, लूट की, सूट-बूट की सरकार। pic.twitter.com/anSiQ8Zird
— Rahul Gandhi (@RahulGandhi) December 2, 2020
Advertisements