గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. గుజరాత్ లోని దహాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సభలో మాట్లాడుతూ మోడీ సర్కార్ పై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు.
మోడీ ప్రభుత్వం ధనికుల కోసం ఒక ఇండియాను, పేదవాళ్ల కోసం మరో ఇండియాను తయారు చేసిందన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ లో చేసిన పనులను మోడీ ఇప్పుడు ప్రధాన మంత్రిగానూ చేస్తున్నారని అన్నారు.
దేశం మొత్తంలో గుజరాత్ లో మాత్రమే నిరసన తెలిపేందుకు అనుమతులు కావాలన్నారు. నిరసన తెలిపినందుకే జిగ్నేశ్ మేవానికి మూడు నెలల జైలు శిక్షపడిందన్నారు. పదేండ్లు జైలు శిక్ష అనుభవించినప్పటికీ అది ఆయనను ప్రభావితం చేయలేదని చెప్పారు.
కాంగ్రెస్ కు రెండు భారత్ లను కోరుకోవడం లేదన్నారు. బీజేపీ మోడల్ లో గిరిజనులు, ఇతర పేదలకు చెందిన నీరు, అడవులు వంటి వనరులను కొంత మందికి మాత్రమే మోడీ పంచిపెడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదివాసీల హక్కులను పోగొట్టిందన్నారు.