పంజాబ్ లో దారుణ హత్యకు గురైన సింగర్, కాంగ్రెస్ నేత సిద్దూ మూసేవాలా కుటుంబాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేడు పరామర్శించనున్నారు.
సిద్దూ హత్యకు గురైనప్పుడు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఘటన జరిగిన వారం తర్వాత ఆయన భారత్ కు తిరిగి వచ్చారు. అనంతరం ఘటనకు సంబంధించిన వివరాలను కాంగ్రెస్ నేతలను అడిగి ఆయన తెలుసుకున్నారు.
పంజాబ్ కాంగ్రెస్ అగ్రనేతలతో కలిసి సిద్దూ ఇంటికి వెళ్లి ఆయన తల్లిదండ్రులను రాహుల్ పరామర్శించనున్నారు. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు వెల్లడించాయి.
రాజస్థాన్ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ సిద్దూ కుటుంబాన్ని సోమవారం పరామర్శించారు. సిద్దూ హత్యపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.