జల్లికట్టు పోటీలను తిలకించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ తమిళనాడులో పర్యటించారు. జల్లికట్టులో పాల్గొన్న వారితో కొద్దిసేపు ముచ్చటించారు. జల్లికట్టు క్రీడను తమిళ సంస్కృతి, చరిత్రకు కొనసాగింపుగా అభివర్ణించిన ఆయన… తమిళ ప్రజలను చెప్పుచేతల్లో పెట్టుకోగలమని భావిస్తున్నవారికి ఓ సందేశం ఇవ్వాలని అక్కడికి వచ్చినట్లు తెలిపారు.
తమిళ ప్రజల తరఫున నిలబడి వారి చరిత్రను, సంస్కృతిని, బాషను కాపాడటం నా బాధ్యత. మీ సంస్కృతి, మీ భావాలను, మీ చరిత్రను తెలుసుకోవాలనుకుని వచ్చానని… భారత దేశ భవిష్యత్తుకు తమిళ సంస్కృతి, భాష, చరిత్ర చాలా ముఖ్యమని కామెంట్ చేశారు.
రాహుల్‌తో పాటు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కుమారుడు, సినీ నటుడు ఉదయనిధి, పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్, టీఎన్‌సీసీ చీఫ్ కేఎస్ అలగిరి, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి పాల్గొన్నారు.