భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈ యాత్రలో భాగంగా ఆయా రాష్ట్రాల్లో సినీ నటులు, ప్రముఖులు, మిత్రపక్ష నాయకులు రాహుల్ గాంధీతో కలిసి నడుస్తున్నారు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, బాక్సర్, ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్ శుక్రవారం నిర్వహించిన యాత్రలో పాల్గొన్నారు.
అయితే ఈ సందర్భంగా ఆయన రాహుల్ గాంధీతో కలిసి నడిచిన సమయంలో చోటు చేసుకున్న పరిణామం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మధ్యప్రదేశ్ లోని ఖార్గోన్ లో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో విజేందర్ సింగ్ పాల్గొన్నారు. కొన్ని కిలో మీటర్ల పాటు రాహుల్ గాంధీతో కలిసి నడిచారు.
వీరిద్దరు కలిసి నడుస్తున్న సమయంలో ఒకరుతో ఒకరు మాట్లాడుకున్నారు. సెల్పీలు తీసుకున్నారు. రాహుల్ విజేందర్ ఇద్దరు కలిసి మీసాలు తిప్పారు. వీరి మధ్య జరిగిన ఈ సంభాషణ తీరునంతా కాంగ్రెస్ శ్రేణులు వీడియో తీసి, భారత్ జోడో యాత్ర ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హర్యానాలోని భివానీ జిల్లాకు చెందిన విజేందర్ సింగ్.. గత లోక్ సభ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ నుంచి పోటీ చేశారు. అయితే అందులో విజయం సాధించకపోయిన మూడో స్థానంలో నిలిచారు. ఆయన 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించారు. దీంతో ఒలింపిక్ లో కాంస్య పతకం సాధించిన మొదటి భారతీయ బాక్సర్ గా రికార్డు నెలకొల్పారు.
విజేందర్ సింగ్ కామన్వెల్త్ గేమ్స్ లో, రెండు రజతాలు, ఒక కాంస్యం సాధించారు. ఆయన ప్రస్తుతం ప్రొఫెషనల్ బాక్సర్ గా వ్యవహరిస్తున్నారు. అనేక దేశాల్లో నిర్వహించే పోటీల్లో పాల్గొంటున్నారు.
అయితే రాహుల్ గాంధీ మీసాలు తిప్పుతున్న వీడియోకు భిన్న స్పందన వస్తోంది. పలువురు ఆయనను ప్రశంసిస్తుండగా.. మరికొందరు ఎగతాళి చేస్తున్నారు. భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ నెలలో కన్యాకుమారిలో మొదలయ్యింది. ఈ యాత్ర వచ్చే ఏడాది జనవరిలో ముగుస్తుంది. 3,500 పాటు కొనసాగే ఈ యాత్రలో చాలా మంది ప్రముఖులు పాల్గొంటున్నారు.
बॉक्सिंग रिंग के अजेय योद्धा @boxervijender आज आपने #BharatJodoYatra में सड़क पर उतरकर खेत-खलिहान और युवाओं की आवाज़ को ताकत दी है।
शुक्रिया आपका…🙏🏻 pic.twitter.com/4oZOFqPdp9
— Congress (@INCIndia) November 25, 2022