అసోంలో వరద సహాయక చర్యల్లో పాల్గొని వరద బాధితులకు వీలైనంత వరకు సహాయం చేయాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.
‘ అసోంలో తీవ్ర వరదల వల్ల లక్షలాది మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువల్ల రాష్ట్రంలో రక్షణ, సహాయక చర్యల్లో పాల్గొని సహాయం అందించాలని పార్టీ నేతలు, కార్యకర్తలను కోరుతున్నాను’ అని రాహుల్ గాంధీ తెలిపారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 20 జిల్లాల్లో వరదల వల్ల 7,17,046 మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదల వల్ల ఇప్పటి వరకు తొమ్మిది మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు.
అసోం రైఫిల్స్, జాతీయ విపత్తు నిర్వాహణ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. వరదల నేపథ్యంలో సిల్చార్, గువహతిల మధ్య అత్యవసర విమాన సర్వీసులను నడుపనున్నట్టు అసోం కేబినెట్ వెల్లడించింది.