జమ్మూ కాశ్మీర్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు కాంగ్రెస్ మాజీ చీఫ్, ఎంపీ రాహుల్ గాంధీ. ముందుగా గందర్ బాల్ జిల్లాలోని ఖీర్ భవానీ ఆలయానికి వెళ్లారాయన. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత హజరత్ బాల్ మసీదుకు వెళ్లారు. అనంతరం షేక్ హంజా మఖ్దూం సమాధితోపాటు గురుద్వారాను సందర్శించారు.
ఇక దైవ కార్యక్రమాల తర్వాత నేరుగా శ్రీనగర్ కు వెళ్లారు రాహుల్ గాంధీ. అక్కడ జమ్మూ కాశ్మీర్ పీసీసీ హెడ్ క్వార్టర్స్ భవనాన్ని ప్రారంభించారు. పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి జమ్మూ కాశ్మీర్ వెళ్లారు రాహుల్.