మధ్యప్రదేశ్‌లో భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. యాత్రలో భాగంగా మోవ్ ప్రాంతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బైక్ నడిపి సందడి చేశారు. మాల్వా నిమర్ ప్రాంతంలో జన సందోహం మధ్య ఆయన బైక్ నడిపారు.
హెల్మెట్ పెట్టుకుని రాహుల్ గాంధీ బైక్ నడుపుతుండగా, పక్కనే సెక్యూరిటీ ట్రాఫిక్ ను క్లియర్ చేస్తు కనిపించారు. రాహుల్ గాంధీ బైక్ నడుపుతుండగా జనాలు ఉత్సహాంతో కేకలు వేస్తూ కనిపించారు. ఈ వీడియోను కాంగ్రెస్ శ్రేణులు షేర్ చేశాయి. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఇది ఇలా వుంటే రాహుల్ ర్యాలీ ప్రారంభానికి ముందు మోవ్ టౌన్‌లో పవర్ కట్ చేశారు. నగరంలో పావుగంట వ్యవధిలోనే రెండు సార్లు విద్యుత్ ను కట్ చేశారని స్థానికులు తెలిపారు. రాహుల్ గాంధీ వచ్చే వరకు పవర్ వచ్చినప్పటికీ వార్త వైరల్ అయింది.
ఎవరైనా ఉద్దేశపూర్వకంగా విద్యుత్ ను కట్ చేశారా అంటూ సోషల్ మీడియాలో పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందించారు. ఇది సహజమైనది కాదన్నారు. దీని వెనుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర ఉందని మండిపడ్డారు.