బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 ముగిసింది. హౌస్ మెట్ లు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీ గా గడుపుతున్నారు. కానీ బిగ్ బాస్ హౌస్ వారిద్దరూ లవ్ లో పడ్డారంటూ సోషల్ మీడియా కోడైకూసింది. ఎవరా అనుకుంటున్నారా అదేనండి రాహుల్, పునర్నవిలు. కానీ ఇటీవల కాలంలో రాహుల్, పునర్నవి ఈ ప్రచారంకు పులిస్టాప్ పెట్టాలని భావించి మా మధ్య ఎటువంటి లవ్ లేదు మేము జస్ట్ ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చారు.
కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తెగ తిరుగుతున్నారు. ఆ ఫోటోలను అటు రాహుల్, పునర్నవిలు సోషల్ మీడియా లో పోస్ట్ చెయ్యటంతో వీరిద్దరి మధ్య నిజంగానే లవ్ ట్రాక్ నడుస్తుందని సోషల్ మీడియాలో నెటిజన్లు గుసగుస లాడుకుంటున్నారు. నిప్పులేకుండా పొగ రాదని వీరి మధ్య ఎదో ఉందని కామెంట్స్ కూడా చేస్తున్నారు. మరో వైపు వీరి ఇరువురికి ఇష్టం అయితే పెళ్లి చెయ్యటానికి మాకు ఎలాంటి అభిప్రాయం లేదని రాహుల్ పేరెంట్స్ చెప్పిన సంగతి తెలిసిందే.