అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వచ్చిన బిగ్ బాస్ 3 విజయవంతంగా ముగిసింది. టైటిల్ విజేత ఎవరా అన్న ఎదురు చూపులకు తెరదించుతూ… టైటిల్ విజేతను ప్రకటించారు. శ్రీముఖి, రాహుల్ మధ్య జరిగిన పోటీ లో రాహుల్ విజయం సాధించాడు. ఇక మొదటి రెండు షోలతో పోల్చుకుంటే మూడవ సీజన్ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేపోయింది అన్న ప్రచారం కూడా జరిగింది.
అయితే బిగ్ బాస్ 3 రియాలిటీ షోకు వచ్చిన రేటింగ్ వచ్చిందంటే మాత్రం రాహుల్, పునర్నవిల వల్లనే అంటున్నారు ప్రేక్షకులు. వారి మధ్య బిగ్ బాస్ హౌస్ లో ప్రేమ చిగురించిదని సోషల్ మీడియా కోడైకూస్తోంది. వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే కుదిరింది అంటూ కామెంట్స్ వచ్చాయి. పునర్నవి ఎలిమినేట్ అయ్యేటప్పుడు కూడా రాహుల్ వెక్కి వెక్కి ఏడ్వటం, అంతకు ముందు ఫేక్ ఎలిమినేషన్‌లో రాహుల్ బయటకు వెళ్తే… పునర్నవి ఫీలింగ్స్ చూసిన ప్రతి ఒక్కరు వారి మధ్య సమ్‌థింగ్, సమ్‌థింగ్ ఉందని ఫిక్స్ అయిపోయారు. అంతే కాదు హౌస్ లో వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఎవ్వరి మధ్య లేదు అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఒకానొక సమయంలో రాహుల్ పునర్నవి వివాహం చేసుకుంటారు అని కూడా ప్రచారం జరిగింది. టైటిల్ గెలిచాక నేను గెలవటానికి ముఖ్య కారణం పునర్నవే అంటూ రాహుల్ చెప్పటం… ఇప్పుడు మరింత హాట్ టాపిక్ అయింది.