విజయవాడ: పండక్కి సొంత ఊళ్లకు వెళ్లాలనుకునే వాళ్లంటే అందరికీ లోకువే. రైళ్లు, బస్సులు టైమ్ చూసుకుని మరీ రేట్లు పెంచేస్తారు. దసరా సందర్భంగా రైల్వే స్టేషన్లలో కనిపించే రద్దీని దృష్టిలో వుంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్ రేట్లు పెంచేసింది. ముఖ్యమైన స్టేషన్లలో ఇది వర్తిస్తుంది. దసరా సీజన్ అంతా పెంచిన టిక్కెట్ అమలులో వుంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో వుంచుకుని ప్లాట్ ఫామ్ టికెట్ ధర పెంచారు. ఇది అక్టోబరు 10 వరకే వుంటుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. దసరా పండుగ నేపథ్యంలో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ అంతా ఇంతా ఉండదు. సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారితో స్టేషన్లన్నీ క్రిక్కిరిసిపోతుంటాయి. టికెట్ ధర రూ.10 నుంచి రూ.30కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి స్టేషన్లలో ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. నేటి నుంచి అక్టోబరు 10 వరకు మాత్రమే పెంచిన ధరలు వర్తిస్తాయి.