కానిస్టేబుల్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఓ మహిళకు ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో కదులుతున్న ట్రైన్ ను ఎక్కే ప్రయత్నం చేసింది నసీమా బేగం అనే మహిళ. ఈ క్రమంలో ప్లాట్ ఫామ్, రైలు మధ్యలో ఇరుక్కుపోయింది. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ దినేష్ సింగ్ ఆమెను గమనించాడు. వెంటనే స్పందించి బయటకు లాగాడు.
ఓ ప్రయాణికుడు చైన్ లాగడంతో రైలును పది నిమిషాలపాటు ఆపేశారు. నసీమాను కాపాడిన కానిస్టేబుల్ పై ప్రశంసల జల్లు కురిపించారు ప్రయాణికులు, తోటి అధికారులు. సౌత్ సెంట్రల్ రైల్వే కూడా దినేష్ ను పొగుడుతూ ఓ ట్వీట్ చేసింది. కానిస్టేబుల్ సకాలంలో స్పందించాడని కొనియాడింది.