తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. 15 రైళ్లను రద్దు చేసింది. గురువారం నుంచి 17 వరకు రైళ్ల రాకపోకలను నిలిపివేసింది. సికింద్రాబాద్-ఉందానగర్-సికింద్రాబాద్ ప్రత్యేక ప్యాసింజర్ రైలును ఆపేశారు.
కింద్రాబాద్-ఉందానగర్-సికింద్రాబాద్ మెము ప్రత్యేక రైలును కూడా రద్దు చేశారు. అలాగే హెచ్ఎస్ నాందేడ్-మేడ్చల్-హెచ్ఎస్ నాందేడ్ ప్యాసింజర్ రైలు నిలిచిపోయింది. సికింద్రాబాద్-మేడ్చల్-సికింద్రాబాద్ మెము రైలు రాకపోకలు ఆగిపోయాయి.
ఇటు సికింద్రాబాద్-బొల్లారం-సికింద్రాబాద్ మెము ట్రైన్ కూడా రద్దయింది. కాకినాడ పోర్ట్-విశాఖపట్నం మెము రైలును కూడా నిలిపివేశారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వర్షాలు అధికంగా ఉండే ప్రాంతాల వైపు వెళ్లే రైళ్ల షెడ్యూల్ ను రద్దు చేసింది రైల్వే శాఖ.
మరోవైపు హైదరాబాద్ లోనూ వర్షాలు ఆగని నేపథ్యంలో ఎంఎంటీఎస్ రైళ్లను కూడా రద్దు చేశారు. ఈనెల 17 వరకు వీటిని నిలిపివేశారు.