ప్రయాణికులను మెరుగైన సేవలు అందించేందకు ఇండియన్ రైల్వే మరో ముందడుగు వేసింది. దేశ వ్యాప్తంగా 12 భాషల్లో 139 హెల్ప్‌లైన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇదే సమయంలో ఇప్పటి వరకు ప్రయాణికులకు సేవలు అందిస్తున్న 182 నెంబర్‌ను పూర్తిగా రద్దు చేసి.. వాటిని కూడా డయల్ 139 కిందకు తీసుకొచ్చింది.
ఇకపై 139కు ఫోన్ చేసిన సమయంలో.. వినియోగదారులు తమకు నచ్చిన భాషను ఎంపిక చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లే కాకుండా.. అన్ని సాధారణ మొబైల్ ఫోన్లలోనూ ఈ సేవలను అందిస్తోంది రైల్వేశాఖ. ప్యాసింజర్ల డీటెయిల్స్ , రైళ్ల రాకపోకలు, సీట్ల రిజర్వేషన్లు, వీల్‌చైర్, భోజనం, పీఎన్‌ఆర్ నంబర్‌తో పాటు పలు సేవలను 139కి డయల్ చేసి తెలుసుకోవచ్చు. వీటితో పాటు అన్నిరకాల ఫిర్యాదులూ చేయొచ్చు. ఐవీఐఆర్‌తో పాటు ఇండియన్ రైల్వే శాఖ కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌తోనూ మాట్లాడి సమాచారం పొందవచ్చు.