చాలా మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటారు. అది కూడా ఇండియన్ రైల్వే లో ఉద్యోగం అంటే ఇక చెప్పనవసరం లేదు. అంతే కాను రాత పరీక్షా కూడా లేకుండా కేవలం ఎకడమిక్ మెరిట్ ఆధారంగా రైల్వే జాబ్ సంపాదించుకునే అవకాశం కల్పనచింది ఈస్ట్రన్ రైల్వే.
కోల్‌కతా ప్రధానకేంద్రంగా ఉన్న ఈస్ట్రన్ రైల్వేలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ దరఖాస్తులు కోరుతోంది . మొత్తం 2792 ఖాళీలు ఉన్నాయి . ఈ ఉద్యోగాలకు ఐటీఐ క్వాలిఫికేషన్ .. ఫిట్టర్ , వెల్డర్ , లైన్‌మెన్ , వైర్‌మెన్ , ఎలక్ట్రీషియన్ తదితర విభాగాల్లో ఖాలీలున్నాయి . పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు ఎన్‌సీవీటీ / ఎస్‌సీవీటీ , ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి . ఈ ఉద్యోగాలకు వయసు : 15-24 ఏళ్ల మధ్య ఉండాలి . అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది .
ఆన్‌లైన్ ద్వారా ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది . ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 14 న ప్రారంభం అవుతుంది . దరఖాస్తుకు చివరితేది : మార్చి 13, 2020. మరిన్ని వివరాల కోసం https://www.rrcer.com/ అనే వెబ్ సైట్ ను చూడవచ్చు .