సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నక కొద్ది యువత తప్పు దోవపడుతున్నారు. ఎప్పుడూ సెల్ ఫోన్లతో గడుపుతూ సమయాన్ని గడిపేస్తున్నారు. ఇటీవల టిక్ టాక్ మోజులో పడి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్ర విచిత్ర విన్యాసాలకు పాల్పడుతూ యువత ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు టిక్ టాక్ చేస్తుండగా ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. ఆ వీడియో ను కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో రన్నింగ్ ట్రైన్ ను పట్టుకుని యువకుడు పరిగెత్తుతూ తన పట్టుని కోల్పోయి పడిపోయాడు. అదృష్టవశాత్తు ఆ యువకుడికి ఎటు వంటి గాయాలు కాలేదు. ఆ వీడియోకు30000 వ్యూస్ రాగా వందలాది కామెంట్స్ వచ్చాయి. ఎక్కువగా ఆ యువకుడిని తిడుతూ కామెంట్స్ చేశారు.
चलती ट्रेन में स्टंट दिखाना बहादुरी नही, मूर्खता की निशानी है। आपका जीवन अमूल्य है, इसे खतरे में ना डालें।
नियमों का पालन करें, और सुरक्षित यात्रा का आनंद लें। pic.twitter.com/tauidfOqRj
— Piyush Goyal Office (@PiyushGoyalOffc) February 18, 2020
Advertisements