కొన్నిఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తే..ఇంకొన్నిఒళ్లు జలదరింపజేస్తాయి.అలాంటి ఓ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.థానే జిల్లా విఠల్వాడీ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ అంచున ఓ యువకుడు నిలబడ్డాడు.
అతడిని గమనించిన రైల్వే పోలీస్ ట్రైన్ వస్తోంది..కొద్దిగా దూరంగా ఉండు అని చెప్పాడు.దీంతో ఆ యువకుడు కాస్త వెనక్కు జరిగినట్టే జరిగి ట్రైన్ వస్తుండగా పట్టాలపైకి దూకాడు.అది చూసిన రైల్వే పోలీస్ కంగుతిన్నాడు.
ప్రాణాలకు తెగించి అతన్నికాపాడేందుకు దైర్యంగా ట్రైన్ వస్తున్నపట్టాల మీదకు దూకి ఆ యువకున్ని కాపాడాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.
ఆ యువకుడిని కాపాడిన రైల్వే పోలీస్ ను ఉన్నతాధికారులు అభినందించారు.
అతని దైర్య సాహసాలను అభినందిస్తూ.. నెటిజన్లు రియల్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.