తెలంగాణలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 4.5కిలోమీటర్ల ఎత్తులో ఉందని, దీని ప్రభావంతో 24గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని చెప్పింది.
ఈ అల్ప పీడనంతో ఆది, సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అలర్ట్ చేసింది. ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.