హైదరాబాద్‌లో నిన్న భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాలతో పలు కాలనీల్లో అపార్టుమెంట్లలోకి నీళ్లు చేరాయి. మణికొండలోని పంచవటి కాలనీలో ఓ అపార్టుమెంట్ సెల్లార్ నీటి మునిగింది. దీంతో షెల్లార్ లోని కార్లు, బైక్లు నీటిలో మునిగిపోయాయి.
దీంతో అపార్ట్ మెంట్లలో దిగువ వున్న నీటిని మోటార్ల సహాయంతో బయటకు పంపిస్తున్నారు. రోడ్లపై కూడా నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా నిన్న వర్షం కురియడంతో నగర వాసులు ఇంటి నుంచి బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు.
భారీగా వర్షపు నీరు చేరడంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా రాజేంద్రనగర్ ఉప్పార్పల్లి డీ మార్ట్ వద్ద రోడ్డుపైకి వరద నీరు చేరింది. దీంతో భారీగ ట్రాఫిక్ స్తంభించింది.
దీంతో పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించారు. దీంతో సుమారు రెండు గంటల పాటు పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో ఎప్పుడు వర్షం పడినా ఇదే పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తోందని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.