భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్‌కి వరుణుడు అడ్డుపడ్డాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హామిల్టన్ వేదికగా రెండో వన్డేలో టాస్ ఓడిన టీమ్‌ఇండియా బ్యాటింగ్ ప్రారంభించింది.
భారత్ తరపున ఓపెనర్లుగా శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ప్రారంభించగా.. 4.5 ఓవర్ల దగ్గర వర్షం ప్రారంభమైంది. గిల్ 21 బాల్స్‌లో 19 రన్స్ చేయగా, ధవన్ 8 బంతుల్లో 2 పరుగులు చేశాడు.
ఇన్నింగ్స్ 4.5 ఓవర్‌లో ఆటకు వర్షం అడ్డుపడడంతో ఫీల్డ్ అంపర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. పిచ్‌ను కవర్లతో కప్పేశారు. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోవడంతో కెప్టెన్ శిఖర్ ధావన్ డ్రెసింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు.
4.5 ఓవర్లలో భారత్ 22/0 పరుగుల వద్ద కొనసాగుతోంది. టిమ్ సౌథీ 2.5 ఓవర్లలో 11 పరుగులు ఇవ్వగా.. మాట్ హెన్రీ 2 ఓవర్లలో 10 పరుగులు ఇచ్చారు. బ్యాటింగ్‌కు దిగిన దగ్గర నుంచి శుభ్‌మన్ గిల్ దూకుడుగా ఆడగా.. శిఖర్ ధావన్ కాస్త నెమ్మదిగా ఆడాడు.
మ్యాచ్ ప్రారంభానికి ముందే వర్షం కారణంగా టాస్ కాస్త ఆలస్యం అయింది. వర్షంతో గ్రౌండ్ తడిగా ఉండటంతో అంపైర్లు లేటుగా మ్యాచ్‌ను స్టార్ట్ చేశారు.