హైదరాబాద్ లో వర్షం కారణంగా….లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయ్యాయి. ఎక్కడికక్కడే నీరు నిలిచిపోయింది. ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నెహ్రూ జులాజికల్ పార్క్ లో కూడా వరద నీరు చేరింది.
పక్కనే ఉన్న మీరాలం చెరువు నుండి జూపార్క్ లోకి వరద నీరు చేరింది. మరోవైపు సఫారీలోకి భారీగా వరదనీరు చేరడంతో సఫారీ వద్దకు సందర్శకులకు నో ఎంట్రీ బోర్డ్ పెట్టారు అధికారులు.