తెలంగాణాలో రేపటి నుంచి రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల నుంచి వీస్తున్న గాలులు తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో ఉండటంతో.. బుధ, గురువారాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
రాష్ట్రంలో అత్యల్ప ఉష్ట్రోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం పలు ప్రాంతాలలో 3,4 డిగ్రీల ఉష్ట్రోగ్రతలు నమోదయ్యాయి.