హైదరాబాద్ ను భారీ వర్షం ముంచెత్తింది. నగరంలో బుధవారం ఉదయం వర్షం బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.
వర్షాలతో పలు చోట్ల విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి. దీంతో పలు చోట్ల వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
సికింద్రాబాద్ లోని సీతాఫల్ మండిలో అత్యధికంగా 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. బంసిలాల్ పేట్ లో 6.7, వెస్ట్ మారేడ్ పల్లిలో లో 6.1 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు పేర్కొన్నారు.
ఇక అల్వాల్ లో 5.9, ఎల్బీ నగర్ లో 5.8 , గోషామహల్ బాలానగర్ లో 5.4, ఏఎస్ రావు నగర్ లో 5.1, బేగంపేటలోని పాటిగడ్డ లో 4.9, మల్కాజ్ గిరిలో 4.7, సరూర్ నగర్, ఫలక్ నామా లో 4.6, గన్ ఫౌండ్రీ లో 4.4 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదైంది.
కాచిగూడ, సికింద్రాబాద్ లో 4.3, చార్మినార్ లో 4.2, గుడిమల్కాపూర్ నాచారం లో 4.1, అంబర్ పేట్ లో 4, అమీర్ పేట్ సంతోష్ నగర్ లో 3.7, ఖైరతాబాద్ లో 3.6 కురిసినట్టు అధికారులు వెల్లడించారు.