రోజు వారీ కూలీలతో హైదరాబాద్ లో రైతు బంధు సంబరాలు జరుపుతుంది అధికార టిఆర్ఎస్.
మంగళవారం హైదరాబాద్ లోని ఇందిరా పార్కు దగ్గరలోని ఎన్టీఆర్ స్టేడియంలో రైతు బంధు సంబరాలను నిర్వహించారు. ఈ సంబరాలకు ఎవ్వరూ రాకపోటం తో రోజువారీ కూలీలతో జరిపారు.
అంతే కాకుండా ఆ కూలీలను తీసుకొని వచ్చి చివరకు వారికి కూలి పైసలు ఇవ్వకుండా వారి పొట్టకొట్టారు. టిఆర్ఎస్ నాయకులు చేసిన పనికి కూలీ డబ్బుల కోసం వారంతా మాట్లాడాల్సి వచ్చింది. అయితే ఈ ఒక్క సంఘటన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరుకు, కేసీఆర్ తీరు కు నిదర్శంగా చెప్పవచ్చని తెలంగాణ ప్రజలు అంటున్నారు.