అండర్-19 ప్రపంచకప్‌లో టీమిండియా కుర్రాలు చెలరేగిపోతున్నారు. ఉగాండాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 326 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో రాజ్ బవా ఓ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు.
అండర్-19 ప్రపంచకప్‌లో అత్యధిక స్కోర్ చేసిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. 162 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్న రాజ్ ఈ రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకు శిఖర్ ధావన్ (155) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు.
కాగా.. ఈ మ్యాచ్ లో టాస్ ఫీల్డింగ్ ఎంచుకున్న ఉగాండాకు.. మన కుర్రాళ్లు మొదటి నుంచి పరుగులు పెట్టించారు. 50 ఓవర్లలో ఏ మాత్రం గ్యాప్ లేకుండా ఉప్పెనలా చెలరేగిపోయారు. మిడిలార్డర్ బ్యాటర్ రాజ్ బవా 108 బంతుల్లో 162 పరగులు చేయగా.. ఓపెనర్ అంగ్‌కృష్ రఘువంశీ 120 బంతుల్లో 144 రన్స్ చేసి ఉగాండా బౌలర్లకు ఊరట లేకుండా చేశారు.
50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసి.. ఉగండాకు 406 రన్స్ భారీ లక్ష్యాన్ని నిర్థేశించింది భారత్. తరువాత బ్యాటింగ్ కి దిగిన ఉగండా కేవలం 79 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలింగ్ వేగానికి ఎక్కవ సమయం నిలబడలేకపోయారు. కెప్టెన్ నిశాంత్ సింధు నాలుగు వికెట్లు పడగొట్టగా, హంగర్గేకర్ రెండు వికెట్లు తీశాడు.