లెజెండరీ యాక్టర్ రాజ్ కపూర్ బంగ్లాను గోద్రెజ్ ప్రాపర్టీస్ సంస్థ కొనుగోలు చేసింది. ముంబైలోని చెంబూర్ లోని రాజ్ కపూర్ బంగ్లాను లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టును అభివృద్ది చేసేందుకు కొనుగోలు చేసినట్టు సంస్థ ప్రకటించింది. ఆ స్థలాన్ని రాజ్ కపూర్ కుటుంబ సభ్యుల నుంచి కొనుగోలు చేసినట్టు పేర్కొంది.
అయితే ఈ బంగ్లాను ఎంతకు కొనుగోలు చేశారనే విషయాన్ని మాత్రం సంస్థ వెల్లడించ లేదు. ఈ స్థలం డియోనార్ ఫార్మ్ రోడ్, చెంబూర్‌లో టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సంస్థకు పక్కనే ఉంది. ఈ స్థలాన్ని 2019లోనే గోద్రెజ్ సంస్థ కొనుగోలు చేసింది.
ఆర్‌కెఎస్‌ను అభివృద్ధి చేయడానికి కపూర్ కుటుంబం నుండి చెంబూర్‌లోని ఆర్‌కె స్టూడియోస్‌ను కొనుగోలు చేసినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్స్ లో సంస్థ వెల్లడించింది. ఈ ప్రాజెక్టు ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. దీనిపై గోద్రెజ్ ప్రాపర్టీస్ ఎండీ గౌరవ్ పాండే మాట్లాడుతూ…
ఈ ఐకానిక్ ప్రాజెక్ట్‌ను తమ పోర్టు ఫోలియోలో యాడ్ చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమపై నమ్మకం ఉంచి తమకు ఈ అవకాశాన్ని ఇచ్చిన కపూర్ కుటుంబ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై రణదీర్ కపూర్ మాట్లాడుతూ…. ఆ బంగ్లాకు చారిత్రక ప్రాధాన్యత ఉందన్నారు. ఆ బంగ్లాతో తమ కుటుంబానికి గొప్ప అనుబంధం ఉందన్నారు. ఈ స్థలాన్ని తదుపరి దశ అభివృద్ధి కోసం ముందుకు తీసుకెళ్లడానికి గోద్రెజ్ ప్రాపర్టీస్‌తో జతకలిసినందుకు తాము సంతోషిస్తున్నామన్నారు.