హైదరాబాద్ : నార్సింగ్ కారు యాక్సిడెంట్ కేసులో సినీ హీరో రాజ్‌తరుణ్‌ను అరెస్టుచేశామని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు చెప్పారు. రాజ్‌తరుణ్‌పై సెక్షన్ 279, సెక్షన్ 336 కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. యాక్సిడెంట్‌పై రాజ్‌తరుణ్ ఇచ్చిన స్టేట్‌మెంట్ రికార్డు చేశామని వివరించారు. 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చామని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడో లేదో తమకు స్పష్టంగా ఆధారాలు లభించలేదని చెప్పారు. రాజ్‌తరుణ్ యాక్సిడెంట్ వీడియోలతో కార్తిక్ అనే వ్యక్తి బెదిరింపులు దిగాడని, ఆ మేరకు రాజ్‌తరుణ్ మేనేజర్ రాజా రవీంద్ర మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని డీసీపీ చెప్పారు. కార్తిక్‌ను అరెస్ట్ చేసి విచారిస్తామని తెలిపారు. ఇలావుంటే, తనను పోలీసులు అరెస్ట్ చేయలేదని, కేవలం నోటీసు ఇచ్చి పంపారని హీరో రాజ్‌తరుణ్ చెబుతున్నాడు. వివరాలన్నీ రేపు మీడియాకు చెబుతానని అన్నాడు. సోమవరం కోర్ట్‌కి హాజరవుతానని వెల్లడించాడు.
Tolivelugu Latest Telugu Breaking News » Viral » యాక్సిడెంట్ కేసులో రాజ్‌తరుణ్ అరెస్టు