ఒక్కసారిగా ఎగసిపడ్డ కెరటంల లేచి అంతే వేగంతో కింద పడ్డ హీరో రాజ్ తరుణ్. వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న రాజ్ తరుణ్ ప్రస్తుతం ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాలో నటిస్తున్నాడు. కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చెయ్యనున్నారు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన మాళవిక నాయర్ నటిస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.
ఈ లుక్ లో రాజ్ తరుణ్ పై కోపం తో మాళవిక కత్తితో పొడవటానికి చూస్తుంటే మరో వైపు బ్యాట్ పట్టుకుని మాళవిక కొట్టానికి ప్రయత్నిస్తున్న ఫోజులో కనిపించింది. ఇంతకు మాళవిక రాజ్ తరుణ్ మద్యం అసలు ఏమి జరిగిందనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.
ఈ సినిమా యూత్ ని, ఫ్యామిలీ ఆడియోన్స్ ను మెప్పించే విదంగా ఉండబోతుందని ఫిలింమేకర్స్ చెప్తున్నారు. మరో వైపు ఈ సినిమాలో హెబ్బా పటేల్ కూడా ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.