మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన కీలక నిర్ణయం తీసుకుంది. మహా హారతి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహిచాల్సి ఉండగా దాన్ని వాయిదా వేస్తున్నట్టు ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే తెలిపారు.
ముస్లింలకు రంజాన్ జరుపుకోవడంలో ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని భావిస్తున్నట్టు ఠాక్రే అన్నారు. ఈ మేరకు రంజాన్ కార్యక్రమలకు ఆటంకాలు కలిగించ వద్దని తమ కార్యకర్తలను ఆయన ఆదేశించారు.
ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. పండుగల సమయంలో ఏ మత కార్యక్రమాలకు ఆటంకాలు కలిగించడం తమ ఉద్దేశం కాదని ట్వీట్ లో పేర్కొన్నారు. అందువల్ల కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని, అందువల్ల మహా హారతి నిర్వహించకూడదని ఎంఎన్ఎస్ సైనికులను కోరుతున్నానని తెలిపారు.
లౌడ్ స్పీకర్ అనేది మతపరమైనది సమస్య కాదని ఆయన అన్నారు. అది అసౌకర్యానికి సంబంధించిన సామాజిక సమస్య అని తెలిపారు. దీనిపై తాము ఏం చేయాలనుకుంటున్నామో తర్వాత సోషల్ మీడియాలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.