శివసేన పార్టీ పత్రిక ‘సామ్నా’ కార్యాలయం ముందు మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) పేరిట వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. మసీదులపై లౌడ్ స్పీకర్ల వివాదాల మధ్య శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ను హెచ్చరిస్తూ పోస్టర్లు వెలవడం రాష్ట్రంలో చర్చనీయాంశం అయింది.
‘ మిస్టర్ సంజయ్ రౌత్.. మీరు ఎవరిని ఓవైసీ అని సంభోదిస్తున్నారు. మీ లౌడ్ స్పీకర్లను బంద్ చేయండి. లౌడ్ స్పీకర్ల వల్ల మహారాష్ట్ర మొత్తం సమస్య ఎదుర్కుంటోంది. లేదంటే మీ లౌడ్ స్పీకర్లను ఎంఎన్ఎస్ స్టైల్ లో బంద్ చేయిస్తాము’ అని పోస్టర్లలో ఉంది.
ఎంఎన్ఎస్ నేత రాజ్ థాక్రేను మహారాష్ట్ర ఓవైసీగా అభివర్ణిస్తూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యలు చేశారు. ఎంపీ వ్యాఖ్యలపై ఎంఎన్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఎంపీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి.
‘ ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రే మహారాష్ట్రకు ఓవైసీ లాంటివాడు. కేవలం ఆయన ఓట్లను చీల్చడానికే ఉన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్ని్ల్లో అసదుద్దిన్ ఓవైసీ చేసిన మాదిరిగా రాజ్ థాక్రే కూడా చేస్తు్న్నారు’ అని సంజయ్ రౌత్ అన్నారు.