ఈ తరం వాళ్ళకి రాజబాబు అంటే నవ్వుల రారాజని తెలియక పోవచ్చు.కానీ 1960 నుంచి 1980 లలో సినిమాలు చూసిన వాళ్లకు ఆయన పరిచయం అక్కర్లేని పేరు. హీరోలు అతని డేట్స్ కోసం సినిమాలు పోస్ట్ పోన్ చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.
ఇప్పటి హాస్యబ్రహ్మ బ్రహ్మానందానికి 10 రెట్ల పాపులారిటీ దక్కించుకున్న హాస్య నటుడు. ఇక రాజబాబు అసలు పేరు అప్పలరాజు.. ఆయన 1937లో జన్మించి 1983లో మరణించారు.
రాజమండ్రి స్కూల్ టీచర్ గా పని చేస్తూ సినిమాలలో నటించాలని కోరికతో అగ్ర దర్శక నిర్మాతల పిల్లలకు ట్యూషన్ చెబుతూనే మద్రాసులో సినిమా ప్రయత్నాలు చేశారు. అలా 1960లో సమాజం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
రెండు దశాబ్దాల పాటు వెనక్కి తిరగకుండా దూసుకుపోయిన రాజబాబు కొన్ని వందల సినిమాలలో నటించిన ఈయన.. తెలుగు , తమిళ్ సినిమాలలో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు.
అంతే కాదు కొన్ని సినిమాలలో హీరోగా కూడా పనిచేశారు. కోట్ల రూపాయలను కూడబెట్టిన రాజబాబు ఎన్నో కష్టాలు పడి పేదరికం నుంచి ఆ స్థాయికి ఎదిగారు. తనకు ఉన్నంతలోనే చాలామందిని ఇంటికి పిలిచి మరీ భోజనం పెట్టేవారు..
ఒకానొక సమయంలో మనిషి రోడ్డున పడ్డాడు అనే సినిమాకు రాజబాబు నిర్మాతగా వ్యవహరించగా.. ఆ సమయంలోనే ఆ సినిమా వల్ల సంపాదించిన డబ్బుంతా పోగొట్టుకున్నారు.
ఒకరకంగా చెప్పాలి అంటే ఈ సినిమా వల్ల ఆయన రోడ్డున పడ్డారు. డబ్బు ఉన్నప్పుడు ఆయన చెంత చేరిన చాలామంది డబ్బు పోయిన తర్వాత ఆయనను పట్టించుకోవడమే మానేశారు.