మునుగోడు ఉప ఎన్నికలు దగ్గరపడే కొద్దీ పొలిటికల్ వ్యూహాలు మరింత పదునెక్కాయి. ఈ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ టీఆర్ఎస్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్ లు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఓ వైపు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తూనే.. మరోవైపు ప్రత్యర్ధి పార్టీలపై కూడా విమర్శలు ఎక్కుపెడుతున్నాయి.
మునుగోడు ఉప ఎన్నికల్లో అరుదైన సన్నివేశం ప్రత్యక్షమయింది. చండూర్ లో ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి… ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎదురుపడ్డారు. ఎదురుపడ్డ వారిద్దరూ నవ్వుతూనే ఆలింగనం చేసుకున్నారు. ఈ సమయంలో రాజగోపాల్ రెడ్డి అనుచరులు జై బీజేపీ అంటూ నినాదాలు హోరెత్తించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నవంబర్ 3న జరగనున్న మునుగోడు ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు జోరుగా ప్రచారాలు చేస్తున్నాయి. ఓటర్లకు వరాల జల్లు కురిపిస్తున్నారు.
కాగా టీఆర్ఎస్ పార్టీ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీజేఎస్ నుంచి పల్లె వినయ్ కుమార్, ప్రజాశాంతి పార్టీ నుంచి కేఏ పాల్ లు ఇప్పటికే నామినేషన్లు వేశారు. 6న ఫలితాలు వెలువడనున్నాయి.