దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంటే రాజమండ్రికి చెందిన 22 ఏళ్ళ యువకుడు వైరస్ జయించి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. 13 రోజులు చికిత్స అనంతరం కరోనా పాజిటివ్ నుంచి నెగిటివ్ గా నిర్థారణ అయింది. శుక్రవారం ఆసుపత్రి నుంచి వైద్యులు సదరు యువకుడిని డిశ్చార్జ్ చేశారు. కరోనా ను జయించిన యువకుడిని జిల్లా కలెక్టర్ మురళీదర్ రెడ్డి, ఎస్పీ నయీంఆస్మీ, అభినందించారు. కరోనా పాజిటివ్ వ్యక్తి కి వైద్య సేవలు అందించిన వైద్యులను కూడా అభినందించారు. సకాలంలో ఆసుపత్రి కి వస్తే కరోనాను జయించవచ్చని కలెక్టర్ తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన యువకుడు కోలుకోవటంతో తూర్పుగోదావరి జిల్లాలో కొంత ఉపశమనం కలిగింది.