దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్-రామ్ చరణ్ లు ప్రధాన పాత్రలో నటిస్తుండటంతో అభిమానులు ఈ చిత్రంపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటికీ ఇంతవరకు ఈ చిత్రానికి సంబందించి ఎలాంటి అప్డేట్స్ లేవు. దర్శకుడు రాజమౌళి కూడా ఎక్కడ ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ బయటకు రాకుండా జాగ్రత పడుతున్నారు. అభిమానులు మాత్రం ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ విషయాన్నీ పసిగట్టిన రాజమౌళి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్ ఇవ్వాలని అనుకుంటున్నారట. ఓ ప్రత్యేకమైన వీడియోను విడుదల చేసి సినిమాపై అంచనాలను పెంచేందుకు రాజమౌళి ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ వీడియోకి సంబంధించిన షాట్స్ ను రాజమౌళి తనయుడు కట్ చేస్తుండగా, నేపథ్య సంగీతాన్ని కీరవాణి అందిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ సినిమాకు సంబంధించి హీరోల ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. ఈ వీడియోను మాత్రం ఈనెల14న లేదా 21న గాని విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు.