ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న రాజమౌళి సినిమా RRR. రాంచరణ్, ఎన్టీఆర్ కీ రోల్ పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ వికారాబాద్‌లోని దట్టమైన అడవుల్లో కొనసాగుతోందని తెలుస్తోంది. వారం పాటు ఈ షూటింగ్ కొనసాగే అవకాశం ఉండగా… కేవలం రాత్రిపూట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సీన్స్ అన్ని రాంచరణ్‌పై చిత్రీకరిస్తున్నారని, ఈ సీన్‌లో ఎన్టీఆర్ లేరని తెలుస్తోంది. ఈ షూటింగ్ డిటైల్స్‌ను అత్యంత గోప్యంగా ఉంచుతోంది చిత్ర యూనిట్.
ముందుగా అనుకున్నట్లుగానే జులై 30న సినిమా విడుదలవుతుందని మెగా హీరో రాంచరణ్ ఇప్పటికే ప్రకటించారు. మార్చి చివరకల్లా RRR షూటింగ్ పూర్తి చేసుకోనుండగా.. దాదాపు మూడు నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగబోతున్నాయి. 400కోట్ల బడ్జెట్‌తో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అలియాభట్, ఓలివా మోరిస్, అజయ్ దేవగన్, సుమత్రకని లు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించబోతున్నారు.
Advertisements
హీరోలే కాదు హీరోయిన్లు పోటీలో ఉన్నారే…!