ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో రాజమౌళి పేరు ఇప్పుడు ఇండియాలో మార్మోగుతోంది. అగ్ర హీరోలకు మరుపురాని విజయాలు అందించిన రాజమౌళి కెరీర్ ఇప్పుడు పీక్ స్టేజ్ లో ఉంది. ఆయన ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తుండగా తర్వాత ప్రభాస్ తో మరో సినిమా చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే తమిళ హీరో సూర్యతో చేసే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక బాలీవుడ్ హీరోలు కూడా ఆయనతో టచ్ లో ఉన్నారు. తండ్రి రాసిన కథలను ప్రేక్షకుల ఊహకు అందని విధంగా తీసి రాజమౌళి సంచలనాలు సృష్టిస్తున్నారు. తెలుగు సినిమాకు ఆస్కార్ రావడం అనేది ఇప్పుడు నిజంగా సంచలనం అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంచితే ప్రస్తుతం మహేష్ బాబు సినిమా కోసం రాజమౌళి ఎక్కువగా కష్టపడుతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశం ఉంది.
ఇదిలా ఉంచితే రాజమౌళికి కొన్ని అలవాట్లు ఉన్నాయట. ఆయనకు సంతకం సరిగా పెట్టడం రాదట. ఎప్పుడు సంతకం పెట్టినా సరే కొత్తగానే పెడతారట. అలాగే బయటకు వెళ్ళే సమయంలో జేబులో డబ్బులు తీసుకెళ్ళే అలవాటు లేదట. దీనితో ఆయన భార్య రమా… డ్రైవర్ వద్దనే కొంత డబ్బులు పెడతారట. అలాగే… స్మోకింగ్ గాని తాగడం గాని ఆయనకు అలవాటు లేదు. ఇంట్లో ఉంటే కచ్చితంగా పేకాట ఆడతారట.