సంచలన సినిమాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించే స్టార్ డైరెక్టర్ రాజమౌళి మరో అడుగు ముందుకేస్తున్నట్టు తెలుస్తోంది. మగధీర, ఈగ, బహుబలి 1,2 తో జక్కన్న తన మార్క్ చూపెట్టాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకోవడానికి రెడీ అయ్యాడు.
ఈ నేపథ్యంలోనే బాహుబలి-3 రానుందంటూ గత కొన్నిరోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. వాటిపై ప్రభాస్ స్పందిస్తూ.. పార్ట్-3 గురించి నాక్కూడా తెలియదు..టైం వస్తే ఏదైనా జరగొచ్చు అని చిన్న క్లూ ఇచ్చారు. దానికి ఇప్పుడు రాజమౌళి ఓ క్లారిటీ ఇచ్చారు.
ఇప్పటికే చాలా మంది దర్శకుడు రాజమౌళిని బహుబలి 3 పై ఎన్నో ప్రశ్నలు సంధించారు. వాటన్నింటికి చెక్ పెడుతూ వచ్చిన ఆయన.. చివరకు నోరు విప్పారు. ఇటీవల ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో.. యాంకర్ బహుబలి 3 గురించి ప్రశ్నించగా.. రాజమౌళి దానికి స్పందిస్తూ.. బహుబలి చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలను చూపించనున్నామన్నా అని బదులిచ్చారు.
దీనిపై వర్క్ చేస్తున్నామని.. నిర్మాత శోభు కూడా సుముఖంగా ఉన్నారని పేర్కొన్నారు. దీన్ని తీయడానికి కాస్త టైం పట్టొచ్చు. కానీ.. బాహుబలి నుంచి ఆసక్తికర వార్త రానుందని ఆయన తెలిపారు. దీంతో జక్కన్న బహుబలి 3 పై క్లారిటీ ఇచ్చేశారని.. త్వరలో సినిమా రానుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.