రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించనున్నాడు. మరోవైపు బాలీవుడ్ బ్యూటీ అలియాభట్, స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో జరిగిన షెడ్యూల్ పూర్తి కావడంతో నెక్స్ట్ షెడ్యూల్ మహాబలేశ్వరం వద్ద జక్కన్న ప్లాన్ చేశాడు.
ఇదిలా ఉండగా ఈ మూవీలో శ్రియ కూడా ఒక స్పెషల్ రోల్ లో కనిపించనుంది. శ్రీయ రోల్ పై గత కొన్నాళ్లు గా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చెక్కర్లు కొట్టగా తాజాగా దీనిపై ఓ అప్డేట్ వచ్చింది. శ్రియ పాత్ర పదిహేను నిమిషాలు మాత్రమే ఉంటుందట. అయితే ఆ పాత్ర ఏంటి అనేది మాత్రం తెలియరాలేదు. ఇక బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.