మహేష్-రాజమౌళి కాంబోలో రావాల్సిన సినిమాకు సంబంధించి త్వరలోనే అసలైన పనులు మొదలుకాబోతున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఆల్రెడీ కథ రాశారు. ఆయన రాసిన కథపై మార్చి నెల నుంచి వర్క్ చేయబోతున్నాడు రాజమౌళి.
ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు దర్శకధీరుడు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కు నామినేట్ అయిన సందర్భంగా మరింత ప్రచారం కోసం అక్కడికి వెళ్లిన రాజమౌళి.. ఆ తతంగం పూర్తయిన వెంటనే తండ్రితో కలిసి మహేష్ మూవీ పని మొదలుపెట్టబోతున్నాడు. ఈ మేరకు మహేష్ కు కూడా సమాచారం అందించారు.
రాజమౌళితో వ్యవహారం సింగిల్ సిట్టింగ్ లో అయ్యేది కాదు. అదో ప్రాసెస్. రెగ్యులర్ గా హీరోతో కూర్చొని, కథను కూలంకుషంగా చర్చించి, ప్రతి సన్నివేశాన్ని వివరించి స్క్రీన్ ప్లే లాక్ చేస్తాడు రాజమౌళి. ఈ క్రమంలో మహేష్ బాబుతో ఆయన ట్రావెల్ చేయాల్సి ఉంది.
ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు మహేష్. ఎప్పుడు కావాలంటే అప్పుడు సెట్స్ కు రావొచ్చని, షూటింగ్ గ్యాప్ లో కలిసి మాట్లాడుకుందామని ఆఫర్ ఇచ్చాడు. అంతేకాదు, ఈసారి విదేశీ పర్యటనకు రాజమౌళి-మహేష్ కలిసి వెళ్లే అవకాశం కూడా ఉందంటున్నారు.