యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రస్తుతం ఎవరు మీలో కోటీశ్వరుడు షో నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షో కు ఆరంభంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ హాజరయ్యారు. ఇప్పుడు రాజమౌళి, కొరటాల శివ కూడా హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఎపిసోడ్ సోమవారం టెలికాస్ట్ కానుంది. తాజాగా అందుకు సంబంధించిన ప్రోమో ను షో నిర్వాహకులు రిలీజ్ చేశారు. ఈ ప్రోమో మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక సినిమాల విషయానికొస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. గతంలో కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిందిమ్ రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ 1, యమదొంగ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.