RRR సినిమా కోసం సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు, స్టార్ క్యాస్టింగ్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా సినిమాపై ఆసక్తిని పెంచాయి.ఇక ఈ చిత్రం మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా దర్శకుడు రాజమౌళి పూర్తి నమ్మకంతో ఈ సినిమాపై ఉన్నాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ… మొదటి నుంచే స్టోరీ అందరినీ ఆకట్టుకుంటుందని కానీ రెండవ భాగంలో ఒక సీక్వెన్స్ మాత్రం గూస్ బంప్స్ వచ్చేలా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఊపిరి పీల్చుకోవడం కూడా మరచిపోతారని కానీ మీ గుండె మాత్రం వేగంగా కొట్టుకుంటుందని చెప్పుకొచ్చారు.
సినిమా చూస్తున్నంత సేపు మిగతావన్నీ ప్రేక్షకులు మర్చిపోతారని అన్నారు. చెమటలు పట్టే అరచేతులు, వెన్నెముకలో వణుకు వస్తాయని అన్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. అజయ్ దేవగన్, అలియాభట్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాని డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.