బాహుబలి సినిమా తో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాడు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ సినిమాతో మరో వండర్ సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిజానికి తెలుగు ఇండస్ట్రీని రాజమౌళి బాహుబలి కి ముందు బాహుబలికి తరువాత అనే విధంగా మార్చేశాడు.
బాహుబలి కన్నా ముందు ఇండియన్ సినిమాలకు వేరే దేశాలలో అంత క్రేజ్ ఉండేది కాదు. కానీ బాహుబలి తర్వాత ఆ లెక్కలు మార్చేసాడు ఎస్ ఎస్ రాజమౌళి. బాహుబలి తర్వాత చాలావరకు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగానే రిలీజ్ అవుతున్నాయి.
కానీ ఇతర దర్శకులతో పోల్చుకుంటే దర్శకుడు రాజమౌళికి ఒక ప్రత్యేకమైన టేకింగ్ ఉంటుంది. అలాగే రాజమౌళి తెరకెక్కించిన అన్ని సినిమాల్లో కూడా ఒక కామన్ పాయింట్ ఉంటుంది. అదే విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
Advertisements
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం భార్య పిలల్ల ముందు ఈ విషయాలను ఎప్పుడు మాట్లాడకూడదట !
ఆ కామన్ పాయింట్ ఏంటి అనుకుంటున్నారా ?
రాజమౌళి సినిమాల్లో వెన్నుపోటు అనేది కామన్ పాయింట్ గా ఉంటుంది. హీరోని వెనుక నుంచి ఎవరో ఒకరు పొడుస్తారు. చత్రపతి సినిమా అలాగే యమదొంగ సినిమాలో కూడా వెనకనుంచి వచ్చి విలన్ కత్తితో పొడుస్తాడు. విక్రమార్కుడు లో కూడా ఇదే సీన్ కనిపిస్తుంది.
ఇక బాహుబలి వన్ లో బాహుబలిని కట్టప్ప ఎందుకు వెన్నుపోటు పొడిచాడు అనేది అప్పుడు హైలెట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లో కూడా అలాంటి సీన్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ చేస్తున్నాడు రాజమౌళి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుండగా అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నాడు. అలియా భట్, అజయ్ దేవగన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు.