దర్శకధీరుడు రాజమౌళి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. బాహుబలి సినిమా తో రాజమౌళి వరల్డ్ ఫేమస్ అయ్యాడు. ఇక రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించబోతున్నారు. రామ్ చరణ్ సీతారామ రాజు గా కనిపించనున్నారు. అయితే ఇది ఇలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ తో మళ్లీ సినిమా చేయడం పై రాజమౌళి స్పందించారు.
వామ్మో మళ్లీ ప్రభాస్ తో నా ఇప్పటికే బాహుబలి ఐదు సంవత్సరాలు చేశాము. మళ్లీ అంటే జనాలు తలలు పట్టుకుంటారు అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు. అయితే ఓ మంచి కథ దొరికితే ఖచ్చితంగా ప్రభాస్ తో సినిమా చేస్తా ప్రభాస్ తో చేయడం నాకు ఇష్టమే అంటూ చెప్పుకొచ్చారు రాజమౌళి.