దర్శకదీరుడు రాజమౌళి కి మహాభారతం సినిమా తీయాలనేది ఎప్పటి నుంచో కోరిక. అది అందరికి తెలిసిందే. బాహుబలి తరువాత జక్కన్న ఈ సినిమానే పట్టాలెక్కిస్తాడని అందరు అనుకున్నారు. కానీ అనూహ్యంగా RRR సినిమా తో తెరమీదకు వచ్చాడు జక్కన్న. ఇక మహాభారతం విషయం పక్కన పెట్టేసిన సినీ అభిమానులు ఇప్పుడు మరోమరు మహాభారతం సినిమా గురించి చర్చించుకుంటున్నారు.
రాజమౌళి తాజాగా తన కుటుంబంకు చెందిన పిల్లలు తీసిన ‘మత్తువదలరా’ చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. మత్తువదలరా చిత్రం టీం జైసింహా… అగస్త్య మరియు సత్యల తో రాజమౌళి చిట్ చాట్ నిర్వహించాడు. కొద్ది సమయం వారిని ఇంటర్వ్యూ చేశాడు. అదే సమయంలో వారు కూడా రాజమౌళిని కొన్ని ప్రశ్నలు అడిగారు. మీరు మహాభారతం సినిమా ఒక్క పార్ట్ అయినా తీయగలరా అనే ప్రశ్నకు మహాభారతాన్ని నా స్టైల్ లో చిన్న కథగా మలుచుకోగలనంటూ చెప్పుకొచ్చాడు రాజమౌళి. కానీ ఇప్పుడు కాదని దానికి కాస్త సమయం పడుతుందన్నాడు. ఆమధ్య మహాభారతం పార్ట్ పార్ట్ లుగా తీస్తానని, మహాభారతం తీయడానికి నాకు ఇంకా అనుభవం కావాలి. ఇంకా టెక్నాలజీ పెరగాలంటూ చెప్పిన రాజమౌళి ఇప్పుడు మళ్ళీ ఒకే కథగా తీస్తానంటూ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీసాయి.