దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి తర్వాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇటీవల రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమాను అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఇక తాజాగా చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. నీళ్లలో నిప్పు అంటూ రామ్ చరణ్ పై తీస్తున్న వీడియోను షేర్ చేసింది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగన్ , అలియా భట్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.
View this post on Instagram