దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మగధీర. 2009 లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. టాలీవుడ్ ను షేక్ చేసింది.
అయితే ఈ సినిమా విషయంలో రాజమౌళి కి కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయట. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి చెప్పాడు. ఆర్ఆర్ఆర్ సినిమా ఘన విజయం సాధించడంతో పాటు వెయ్యి కోట్ల గ్రాస్ అందుకున్న సందర్భంగా ఇంటర్నేషనల్ మీడియా హౌజ్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ALSO READ : ఉదయ్ కిరణ్ భార్య ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?
ఈ సందర్భంగా మాట్లాడుతూ మగధీరని కూడా ఎంతో విజన్ తో తీశామని అప్పట్లో ఒక బాహుబలి అయ్యేదని చెప్పుకొచ్చాడు. అయితే మిగతా భాషల్లో డబ్ చేసి మార్కెట్ చేస్తే హిట్ అవుతుందని తాను రామ్ చరణ్ అనుకున్నామని కానీ సినిమా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాత్రం సహకరించలేదని చెప్పారు.
ALSO READ : రాజేంద్ర ప్రసాద్ దెబ్బకు గుండె ఆగిపోయినంత పని అయ్యింది
మళ్లీ తాను అలాంటి సినిమా తీసి రిలీజ్ చేయడానికి 10 ఏళ్లు పట్టిందని… అదే బాహుబలి సినిమా అని చెప్పుకొచ్చారు. బాహుబలి విషయం లో ప్రొడ్యూసర్స్ తన మీద నమ్మకం పెట్టుకున్నారని చెప్పారు.