దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా సినిమాకు తెలుగు సినిమా స్థాయిని పెంచుతూ వస్తున్నాడు రాజమౌళి. రాజమౌళి ఏ హీరోతో సినిమా చేసినా అది ఖచ్చితంగా హిట్ అవుతుందనే క్రేజ్ ను సంపాదించుకున్నాడు. దీంతో పాటు రాజమౌళి సినిమా తర్వాత ప్రతి హీరోకి ఫ్లాప్ ఉంటుంది అనే నింద కూడా ఉంది.
ఉదాహరణకు మగధీర సినిమాతో హిట్ అందుకున్న చరణ్ ఆ తర్వాత ఆరెంజ్ తో ఫ్లాప్ మూటకట్టుకున్నాడు. అలాగే బాహుబలి తర్వాత ప్రభాస్ సాహో ఫ్లాప్ గా నిలిచింది. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో రాజమౌళి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. 1200 కోట్ల రూపాయలను వసూలు చేసింది.
అయితే ఈ సినిమా రిలీజ్ అయిన నెల రోజుల గ్యాప్ లోనే చరణ్ ఆచార్య తో ముందుకొచ్చాడు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీనితో మరోసారి రాజమౌళికి ఎప్పటి నుంచో వస్తున్న బ్యాడ్ నేమ్ కంటిన్యూ అయింది.
కానీ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి సినిమా తర్వాత ఫ్లాప్ సినిమా పడుతుంది అని అందరూ అంటుంటారు. అయితే చరణ్ మాత్రం ఆచార్య తో మరో హిట్ ని అందుకుంటాడు అంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి. కథపై ఉన్న నమ్మకంతో ఆ మాటలు అని ఉండొచ్చు చిరు. కానీ చిరంజీవి నమ్మకం కన్నా రాజమౌళి బ్యాడ్ లక్ ఇందులో గెలిచిందనే చెప్పాలి.
Also Read:
పవన్-తేజుల మల్టీస్టారర్ మూవీ.. సెట్స్‌పైకి ఎప్పుడంటే..?
ఆచార్య, అఖండ సినిమాలలో ఉన్న ఈ కామన్ పాయింట్స్ గమనించారా ?